calender_icon.png 25 July, 2025 | 8:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్రకుట్ర భగ్నం

24-07-2025 12:00:00 AM

అల్ ఖైదాతో సంబంధమున్న నలుగురు ఉగ్రవాదుల అరెస్ట్ 

న్యూఢిల్లీ, జూలై 23: భారత్‌లో భారీ దాడులకు ప్లాన్ చేసిన అల్ ఖైదా కుట్రను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు బుధవారం భగ్నం చేశారు. ఈ నేపథ్యంలో అల్‌ఖైదాతో సంబంధమున్న నలుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు.

వారిలో ఇద్దరిని గుజరాత్‌లో అరెస్టు చేయగా.. ఒకరిని ఢిల్లీ, మరొకరిని నోయిడాలో పట్టుకున్నారు. పట్టుబడ్డ నలుగురిని మహమ్మద్ ఫైక్, మహమ్మద్ ఫర్దీన్, సెఫుల్లా కురేషి, జీషన్ అలీగా గుర్తించారు. వీరంతా 20 నుంచి 25 ఏళ్లలోపు వయసు వారేనని అధికారులు నిర్థారించారు. ప్రస్తుతం ఈ నలుగురిని అధికారులు విచారిస్తున్నారు.