calender_icon.png 5 July, 2025 | 6:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చల్ల హరిశంకర్‌ను సన్మానించిన జ్యోతి నగర్ మున్నూరు కాపు సంఘం

04-07-2025 08:38:01 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): ఇటీవల జరిగిన మున్నూరు కాపు రాష్ట్ర ఎన్నికలలో ఏకగ్రీవంగా  రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియామకమైన చల్ల హరి శంకర్ ను జ్యోతి నగర్ మున్నూరు కాపు సంఘ అధ్యక్ష ప్రధానకార్యదర్శులు కొత్త అనిల్ కుమార్, దొగ్గలి శ్రీధర్ ఆధ్వర్యంలో సంఘ సభ్యులు అందరూ కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చల్ల హరి శంకర్  మాట్లాడుతూ... "రాష్ట్రమంతా ఒకే కులం ఒకే సంఘం అనే నినాదంతో ముందుకు వెళుతూ మున్నూరు కాపుల ఐక్యతను చాటాలని. అలా ఐక్యత ఉన్నప్పుడే రాజ్యాధికారం మన సొంతమవుతుందని తెలిపారు. ఈ సందర్భంలోనే జ్యోతి నగర్ మున్నూరు కాపు సంఘ సభ్యులను అభినందిస్తూ ప్రభుత్వం ద్వారా సంఘ భవనానికి తన వంతు సహకారాన్ని అందిస్తానని" తెలిపారు.