29-09-2025 12:18:15 AM
-పాల్గొన్న హైడ్రా అధికారి, హాస్పటల్స్ డైరెక్టర్లు, డాక్టర్లు, సిబ్బంది
-ప్రతి ఒక్కరు రెగ్యులర్ చెకప్‌లు చేయించుకోవాలని సూచన
-విజయంతమైన కార్యక్రమం
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 28: వరల్డ్ హార్ట్ డే 2025 సందర్భంగా నగరంలోని గచ్చిబౌలిలో ఉన్న ఓమెగా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆదివారం 5కిమీ వాక్‌థాన్ అండ్ రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 550 మందికి పైగా వైద్యులు, హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్, ఫిట్‌నెస్ అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమం లో ఓమెగా హాస్పిటల్స్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ అండ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ మహతి ప్రియదర్శిని మాట్లాడుతూ ప్రతిరోజు వ్యాయామం చేయడం, మద్యాన్ని వదిలేయడం, రెగ్యులర్ చెకప్‌లు చేయించు కోవడం హృదయ రోగాల నివారణకు ఉత్తమ మార్గమన్నారు.
కార్డియాలజిస్ట్ వికాస్‌రెడ్డి మద్దాలి మాట్లాడుతూ 30 సంవత్సరాల వయసు పైబడిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హృదయ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సీనియర్ కార్డియాలజిస్ట్ గణేష్ మాధన్ మాట్లాడుతూ 2025 థీమ్‘డోన్ట్ మిస్ ఎ బీట్’ కొన్ని హార్ట్ బీట్‌లు మిస్ అయితే కూడా ప్రాణాపయం కలుగుతుందని, ప్రతి హార్ట్ బీట్ ముఖ్యమని పేర్కొన్నారు. కార్డియాలజిస్ట్‌లు నాగూర్, ఎ.రామకృష్ణుడు మాట్లాడు తూ జీవన శైలి లో మార్పులు, ఒత్తిడి నియంత్రణ, సమయానికి వైద్య పరీక్షలు హృదయ రోగాలన తగ్గించే మార్గాలని సూచించారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఓమేగా హాస్పిటల్స్ డైరెక్టర్ సీహెచ్ పద్మజ,హైడ్రా అడిషనల్ కమిషనర్ ఏఎన్ అశోక్‌కుమార్, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ అండ్ మెడికల్ డైరెక్టర్ మహతి ప్రియదర్శిని, సీనియర్ కార్డియాలజిస్ట్ గణేష్ మాథన్, కార్డియాలజిస్ట్‌లు నాగూర్, వికాస్‌రెడ్డి మద్దాలి, ఎ.రామకృష్ణుడు, డెర్మాటోలాజిస్ట్ సాయి సింధు ఎం, ఈఎన్‌టీ నిపుణురాలు వెన్నెల దేవరకొండ, న్యూరో ఫిజిషియన్ ప్రవల్లిక దత్త తదితరులు పాల్గొన్నారు.