29-09-2025 12:17:42 AM
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
చిట్యాల, సెప్టెంబర్ 28: యువత స్వయం ఉపాధి కల్పించుకొని స్వశక్తితో ఎదగాలని కార్నివాల్ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామ సమీపంలో నేషనల్ హైవే 65 వద్ద నూతనంగా ఏర్పా టు చేసిన కార్నివల్ రెస్టారెంట్ ను రోడ్లు భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం ముఖ్య అతిధులుగా పాల్గొని ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్బంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలు పరిమితంగా ఉంటాయని, ప్రభుత్వం అందరికీ ఉద్యోగఅవకాశాలు కల్పించలేదని, యువత స్వయం ఉపాధి కల్పించుకొని స్వశక్తితో ఎదగాలని అన్నారు. కష్టపడనిదే ఏది సాధించ లేమని, నూతనంగా రెస్టారెంట్ ను ఏర్పాటు చేసిన యువకులను అభినంధించి రెస్టారెంట్లో వంటగదిని నిత్యం పర్యవేక్షిస్తూ ఆహార పదార్థాలు నాణ్యతగా ఉండేలా చూసుకోవాలని, హైవేపై వచ్చి పోయే ప్రయాణికులకు రుచి కరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని సూచిం చారు.
నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించిన యువకులను అభినందిస్తూ శుభాకాం క్షలు తెలిపారు. చిట్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి, డిసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాటం వెంకటేశం, ఏనుగు రఘు మా రెడ్డి, ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇందిరా భవన్‌లో ప్రజా దర్బార్
నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 28: నల్లగొండ జిల్లా కేంద్రంలోని మినిస్టర్ క్యాంప్ కార్యాలయం(ఇందిరా భవన్) లో ఆదివారం రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు.ఉదయం నుండి మంత్రి ఇందిరా భవన్ లో ప్రజలకు అందుబాటులో ఉన్నారు. తమ సమస్యలను చెప్పుకోవడానికి వచ్చిన వారిని కలిసి మాట్లాడారు.
పలువురు వృద్ధులు,మహిళలు, పట్టణానికి చెందిన పలువురు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే పరిష్కారం అయ్యే సమస్యలకు సంబంధిత అధికారులకు ఫోన్ చేసి క్లియర్ చేయాలని ఆదేశించారు. పలు వినతులు స్వీకరించిన మంత్రి, ఆమోదయోగ్యమైన సమస్యలను వెంటనే పరిష్కరించేలా కృషి చేస్తానని వారికి భరోసా కల్పించారు.
ఆర్థిక సహాయం..
చిట్యాల, సెప్టెంబర్ 28(విజయ క్రాంతి): నిరుపేద విద్యార్థి ఎంబీబీఎస్ సీటు సాధించగా హాస్టల్ వసతి కొరకు ఆదివారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామం పేద కుటుంబానికి చెం దిన మహంకాళి కృష్ణ కూతురు మహం కాళి ఇందు ఎంబిబిఎస్ సీటు సాధించగా వారికి హాస్టల్ వసతి కొరకు 50,000 రూపాయలు ఆర్థిక సాయం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అందజేశారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు.