29-09-2025 12:18:46 AM
ధర్మ యుద్ధం మహాసభకు భారీగా తరలి వెళ్లిన ఆదివాసీలు
మణుగూరు, సెప్టెంబర్ 28(విజయక్రాంతి) : గత 49 ఏళ్లుగా లంబాడా, సుగాలి, బంజారాలు తమ రిజర్వేషన్లుదోచుకుంటున్నారని చట్టబద్దత లేని వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివారం వివిధ ఆదివాసి సంఘాల నాయకులు డిమాండ్ చే శారు. భద్రాచలంలోజరుగుతున్న ధర్మయు ద్ధ బహిరంగ సభకు సబ్ డివిజన్ లోని పలు మండలాల నుండి భారీగా ఆదివాసులు తర లి వెళ్లారు.
ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి నాయ కులు మాట్లాడారు. ప్రధాన రంగాల్లో ఆదివాసి ఉద్యోగ, ఉపాధి అవకాశలను లంబాడీ లు కొల్లగోడుతున్నారని ఆరోపించారు. 1977లో ఎమర్జెన్సీ సమయంలో లంబాడీలు లేరని, తరువాత వారు ఆదివాసులు ఎలా అవుతారని ప్రశ్నించారు.
సుప్రీం కోర్ట్ తీర్పు వెలువడేంత వరకు లంబాడీలకుఎస్టీకుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయవద్దని డిమాండ్ చేశారు. లంబాడీలను ఎస్టీ జాబి తా నుండి తొలగించే వరకు ఐక్య ఉద్యమా లు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి ఉద్యోగ, మహిళ సఘా ల నాయకులు పాల్గొన్నారు.