calender_icon.png 6 October, 2025 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాకా వెంకటస్వామి సేవలు చిరస్మరణీయం

06-10-2025 12:21:03 AM

మంత్రి పొన్నం ప్రభాకర్

ఖైరతాబాద్, అక్టోబర్ 5 (విజయ క్రాంతి) : కార్మికుల సంక్షేమం కోసం కాకా వెంకటస్వామి చేసిన సేవలు చిరస్మరణీయమైనవని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు . ఆదివారం  మాజీ కేంద్ర మంత్రి కాక వెంకట స్వామి 96వ జయంతిని పురస్కరించుకొని రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాం స్కృతిక శాఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి  మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, వంశీకృష్ణ తదితరులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాక చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం జీవితాంతం పోరా టం చేసిన గొప్ప వ్యక్తి వెంకటస్వామి అని కొనియాడారు.

కార్మిక నాయకుడు నుండి కేంద్ర మంత్రి వరకు స్వయంగా ఎదిగి బడు గు బలహీన వర్గాల గొంతుకగా  నిలిచారని తెలిపారు. తెలంగాణ తొలి దశ, మలిదశ ఉద్యమాలలో  ఆయన పోరాటం స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పీసీసీ హోదాలో కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేనిదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక గొప్ప గుర్తింపు పొందిన రాజకీయ నాయకుడు కాకా వెంకటస్వామి అని తెలిపారు. ఆయన ఆశయ సాధన కోసం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.