calender_icon.png 31 December, 2025 | 10:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాకతీయ హైస్కూల్‌కు జిల్లా స్థాయి ప్రథమ బహుమతి

31-12-2025 12:01:30 AM

నాగర్ కర్నూల్ డిసెంబర్ 30 (విజయక్రాంతి): జిల్లా సైన్స్ ఫెయిర్ ప్రదర్శనలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కాకతీయ హై స్కూల్, నాగర్కర్నూల్కు చెందిన 8వ తరగతి విద్యార్థినులు ఎస్. సహస్ర, యశస్విని, శ్రీ చందన జిల్లా స్థాయిలో ప్రదర్శించిన సైన్స్ ఫెయిర్ జిల్లా మొదటి బహుమతి సాధించి రాష్ట్ర స్థాయిలో జరిగే సైన్స్ ఫెయిర్ కు ఎంపికైనట్లు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థినుల విజయం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.