31-12-2025 12:00:00 AM
కాకతీయ విశ్వవిద్యాలయం,డిసెంబర్ 30(విజయక్రాంతి): సోషల్ వర్క్ విభాగం లో పొన్నం కమలాకర్ కు డాక్టర్ రేట్ ప్రకటించినట్లు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి కట్ల రాజేందర్ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం సుల్తాన్ పూర్ గ్రామానికి చెందిన కమలాకర్ ఇంటిగ్రేటెడ్ చైల్ ప్రొటెక్షన్ స్కీమ్ అండ్ చైల్ కేర్ స్టేటస్ ఏ స్టడీ ఆఫ్ ఏరెస్టు వైల్ వరంగల్ డిస్ట్రిక్ట్ అంశంపై పరిశోధన చేసి సమర్పించిన గ్రంధానికి డాక్టర్ రేట్ ప్రకటించినట్లు ఆయన తెలిపారు.
సోషియాలజీ అండ్ సోషల్ వర్క్ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ యం.స్వర్ణలత పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశారు. ప్రస్తుతం మహబూబాబాద్ పీజీ కళాశాలలో సోషల్ వర్క్ విభాగంలో పార్ట్ టైం అధ్యాపకునిగా పనిచేస్తున్నారు. డాక్టర్ రేట్ పొందిన కమలాకర్ ను కేయూ లోని సోషియాలజీ అండ్ సోషల్ వర్క్ అధ్యాపక బృందం, పరిశోధక విద్యార్థులు, పీజీ విద్యార్థులు అభినందనలు తెలిపారు.