31-12-2025 12:02:44 AM
జడ్చర్ల, డిసెంబర్ 30: గ్రామీణ ప్రాంత విద్యార్థులను మార్షల్ ఆర్ట్సో్ల జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన గంగాపూర్ గ్రామానికి చెందిన మాస్టర్ కేశవ్ కరాటే అకాడమీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు మాస్టర్ కేశవ్ గౌడ్ కు ప్రతిష్టాత్మక నేషనల్ సుప్రీం మల్టీ టాలెంట్ మార్షల్ ఆరట్స్ నంది అవార్డు2025 వరించింది. ఆదివారం నాంపల్లి ఉర్దూ మస్కాన్ ఆడిటోరియంలో డ్రాగన్ షాడో కుంఫు మార్షల్ ఆరట్స్ అకాడమీ ఆధ్వర్యంలో, సయ్యద్ అన్సర్ అలీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయనకు అవార్డును అందజేశారు.
గత 24 సంవత్సరాలుగా నిరుపేద విద్యార్థులకు ఉచితంగా మార్షల్ ఆరట్స్ శిక్షణ అందిస్తూ,గ్రామీణ స్థాయి క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించే స్థాయికి తీర్చిదిద్దడంలో మాస్టర్ కేశవ్ గౌడ్ విశేష కృషి చేశారు.అలాగే 2022లో హైదరాబాద్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో 5483 క్రీడాకారులతో అంతర్జాతీయ స్థాయి అత్యధిక ఈవెంట్ గల టోర్నమెంట్ గా హైరేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్ కైవసం చేసుకున్నారు.
కరాటే లోనే కాకుండా సామాజిక సేవ రంగంలో పాలు సేవలందిస్తూ నందుకుగాను నంది పురస్కార్ లభించింది.ఈ అవార్డును ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరోయిన్ గీత హేమంత్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సయ్యద్ అన్సర్ అలీ,మాస్టర్ యూసఫ్,మాస్టర్ ఖజావుద్దీన్,మాస్టర్ శౌకత్, మాస్టర్ కరీం,మాస్టర్ శివకృష్ణ గౌడ్, మాస్టర్ అనిల్ తదితరులు పాల్గొని మాస్టర్ కేశవ్ గౌడ్ను శాలువాతో సత్కరించి,సర్టిఫికెట్ అందజేసి అభినందించారు.