calender_icon.png 6 August, 2025 | 8:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి

06-08-2025 01:08:27 AM

  1. విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసిన స్పెషల్ సీఎస్, కలెక్టర్, పీఓ

రాష్ట్ర రెవెన్యూ (విపత్తు నిర్వహణ)  ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్

ఏటూరునాగారం,ఆగస్టు5(విజయక్రాంతి):విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని రాష్ట్ర రెవెన్యూ (విపత్తు నిర్వహణ)ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ సూచించారు మంగళవారం ఏటూరునాగారం మండల కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలను స్పెషల్ సీఎస్,కలెక్టర్, పిఓతో కలిసి సందర్శించి,వంటశాల,ఆహారం నాణ్యత,స్టోర్ రూము,కూరగాయలు నిల్వలు,హాజరు పట్టిక,ఆహారం నాణ్యతపై విద్యార్థులు వ్రాసిన ఫీడ్ బ్యాక్, పరిసరాలను పరిశీలించారు.

విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పిస్తుందని,విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు,సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనతో పాటు మెనూ ప్రకారం అల్పాహారం, భోజనం అందించాలని స్పష్టం చేశారు.

తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యావసర సరుకులను వినియోగించాలని,నాణ్యత, లేని సరుకులు వాపసు చేయాలని ఆదేశించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల పఠనా సామర్థ్యం, ఆరోగ్యం పట్ల  ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఈ రోజు ఉదయం ఏం టిఫిన్ చేశారు,మంచిగా ఉందా అంటూ విద్యార్థులను అడిగారు.

బావుందని చెప్పడంతో ఇలానే నాణ్యత పాటించాలని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది రావొద్దని సూచించారు. అనంతరం స్పెషల్ సీఎస్,కలెక్టర్,పిఓతో కలిసి వైటిసిలో భారీ వర్షాలు,ఎగువ నుంచి వస్తున్న నీటి వరదలకు అత్యవసరంగా సహాయక చర్యలు అందించుటకు సిద్ధంగా ఉన్న 25మంది   ఏన్డిఆర్‌ఎఫ్ బృందం ఉపయోగించు పరికరాలను పరిశీలించారు.