calender_icon.png 18 August, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోడి కూతతోనే క్యూ

18-08-2025 01:05:28 AM

  1. యూరియా కోసం రైతుల గోస 
  2. దెబ్బతింటున్న పంటలు

మహబూబాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి): కోడికూయంగానే పొలానికి వెళ్లే రైతులు ఇప్పుడు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ పట్టుకొని యూరియా కోసం సొసైటీ గోదాముల వద్దకు పరుగులు పెడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, నెల్లికుదురు, ఇనుగుర్తి మండలాల్లో ఆదివా రం తెల్లవారుజామునే రైతులు వందల సంఖ్య లో రైతు వేదికలు, సొసైటీ ఎరువుల షాపుల వద్దకు చేరుకున్నారు.

ఒక్కరికి ఒక్క బస్తా యూరియా ఇస్తుండటంతో పురుషులు, మ హిళలు వేరువేరుగా క్యూ కట్టారు. రద్దీ పెరగడంతో పోలీసులు చేరుకుని క్యూలైన్ ద్వారా టోకెన్‌లు ఇప్పించారు. కేసముద్రం సొసైటీ ఆధ్వర్యంలో లారీలో దిగుమతి అయిన 222 బస్తాల యూరియాను రైతులకు పంపిణీ చేశా రు. ధనసరి సొసైటీ పరిధిలో టోకెన్లు తీసుకున్న రైతులకు యూరియా రాగానే పంపిణీ చేస్తామని చెప్పారు.

అలాగే ఇనుగుర్తి మండల కేంద్రంలో కూడా ఇదేతరహాలో రైతులు యూరియా కోసం తరలి వచ్చారు. అయితే యూరియా స్టాక్ రాలేదని, టోకెన్లు సోమవా రం ఇస్తామని ఏవో మహేందర్ రైతులకు చె ప్పి శాంతింపజేసి తిప్పి పంపారు. ఇక నెల్లికుదురు మండలం శ్రీరామగిరి, ఎర్రబెల్లి గూడెం సొసైటీ వద్దకు వచ్చిన వందల మంది రైతులకు ఏవో యాస్మిన్ 444 బస్తాల యూరియాను పంపిణీ చేశారు. 

కేసముద్రంలో బీఆర్‌ఎస్ రాస్తారోకో

రైతులకు అవసరమైన యూరియా సరఫ రా చేయాలని డిమాండ్ చేస్తూ కేసముద్రం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ నాయకులు రా స్తారోకో నిర్వహించారు. వానాకాలానికి ముం దే రైతులకు పంటల సాగుకు అవసరమైన ఎరువులను, విత్తనాలను సిద్ధంగా ఉంచాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్లే యూ రియా కొరత ఏర్పడిందని మండిపడ్డారు.