calender_icon.png 18 August, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓ వీర నువు పదరా..

18-08-2025 01:22:17 AM

విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’. ఈ చిత్రానికి విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించారు. శ్రీని గుబ్బల నిర్మాత. ఇందులో హర్ష్ రోషన్, అజయ్, అజయ్ ఘోష్, దయానంద్‌రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటి వరకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ గెలుచుకున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన టీజర్, సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ ‘అర్జున్ చక్రవర్తి’ యాంథమ్‌ను రిలీజ్ చేశారు.

విఘ్నేశ్ భాస్కరన్ ఈ సాంగ్‌ను కంపోజ్ చేయగా విక్రాంత్ రుద్ర సాహిత్యం అందించారు. దీపక్ బ్లూ, బృథ్వీవ్ సత్యకుమార్, విఘ్నేశ్ పాయ్ పాడారు. ‘ఓ వీర నువ్ పదరా.. ఓటమే నీ శిలరా.. ఓ ఉలై తొలిచెయ్‌రా.. శిల్పమే నీవైరా..’ అంటూ సాగుతున్న ఈ పాట ఆద్యంతం స్ఫూర్తిని రగిలించే పదాలతో ఆకట్టుకుంటోంది. కథానాయకుడు విజయరామరాజు ఫిజికల్ ట్రాన్స్ ఫర్మేషన్ అవుతున్న విజువల్స్‌ను ఈ పాటలో అందంగా చూపిం చారు. ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి మాటలు: రవీంద్ర పుల్లె; సాహిత్యం: కృష్ణకాంత్, విక్రాంత్ రుద్ర; డీవోపీ: జగదీశ్ చీకాటి; ఎడిటర్: ప్రదీప్ నందన్.