18-08-2025 01:23:26 AM
అమర్‌దీప్, సైలీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘సుమతీ శతకం’. ఎంఎం నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుంచి హీరోయిన్ సైలీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన మేకర్స్ తాజాగా హీరో అమర్ దీప్ పాత్రను పరిచయం చేశారు. ఈ మేరకు విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో అమర్‌దీప్ ఓ మధ్యతరగతి కుర్రాడిలా కనిపించారు.
మెడలో కూరగాయల దండతో చిరునవ్వు చిందిస్తూ ఎంతో అమాయకంగా కనిపిస్తున్న అమర్‌దీప్ లుక్ ఇదో ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్ అని చెప్పకనే చెప్పేస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి, సినిమాను దసరాకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది మూవీ టీమ్.
ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీత సారథ్యం వహిస్తుండగా, బండారు నాయుడు డైలాగ్స్ రైటర్‌గా, హాలేశ్ కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు. నాహిద్ మొహమ్మద్ ఎడిటర్‌గా, విశ్వప్రసాద్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.