calender_icon.png 10 September, 2025 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బార్ షాపు అనుమతి రద్దు చేసే వరకు పోరాటమే

09-09-2025 10:52:07 PM

వడ్డేపల్లి దళిత వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు తాళ్లపల్లి రవీందర్ (జె.కె)

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ చర్చి జంక్షన్లో బార్ షాప్ అనుమతి రద్దు చేసే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని వడ్డేపల్లి దళిత వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు తాళ్లపల్లి రవీందర్ (జె.కె), జై భీమ్ జిల్లా కన్వీనర్ తాళ్లపల్లి విజయ్ లు అన్నారు. వడ్డేపల్లి చర్చి సర్కిల్లో బార్ అండ్ రెస్టారెంట్ అనుమతి ఈ వెంటనే రద్దు చేయాలని వడ్డేపల్లి దళిత వెల్ఫేర్ కమిటీ, జై భీమ్ ల తో పాటు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం చర్చి జంక్షన్ లో ధర్నా, రాస్తారోకో, నిరసన ప్రదర్శన చేశారు. దీంతో కాజీపేట నుంచి యూనివర్సిటీ వైపు, అంబేద్కర్ సర్కిల్ నుంచి వడ్డేపల్లి వైపు, వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్ నుంచి వడ్డేపల్లి జంక్షన్ వరకు, కేయూ నుంచి వడ్డేపల్లి సర్కిల్ వరకు సుమారు కిలోమీటర్ పొడవున ఆర్టీసీ బస్సులు, కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు నిలిచిపోయాయి. సుమారు గంట వరకు నిర్వహించిన ధర్నాతో పలువురు వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.

కాజీపేట ట్రాఫిక్ పోలీసులు, సుబేదారి పోలీసులు ధర్నా ప్రాంతానికి వచ్చి ఆందోళన కారణాలతో మాట్లాడినప్పటికీ వారు ససే మీరా అన్నారు. జిల్లా ఉన్నత అధికారులు వచ్చి బార్ షాపు అనుమతిని రద్దు చేస్తామని హామీ ఇస్తే తప్ప తాము ఆందోళన విరమింపజేసేది లేదని భీష్ముంచుకొని రోడ్డు పైన బైఠాయించారు. సుబేదారి సిఐ రంజిత్ కుమార్ ఆందోళన కారులతో ఫోన్లో మాట్లాడారు బార్ అండ్ రెస్టారెంట్ అనుమతిని రద్దు విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమింపజేశారు. అనంతరం బార్ షాపు ఏర్పాటు చేసే భవనం ముందు సైతం కొద్దిసేపు నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా తాళ్లపల్లి రవీందర్, తాళ్లపల్లి విజయ్ లు మాట్లాడుతూ చర్చి జంక్షన్ ప్రాంతంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు పింగిలి బాలికల, మహిళా జూనియర్, పిజి కళాశాలలు ఉన్నాయని బారిషాపు వడ్డేపల్లి జంక్షన్ లో ఏర్పాటు చేసి శాంతి భద్రతల కు విఘాతం కలుగుతుందని అన్నారు. ఈ ధర్నాలో వడ్డేపల్లి దళిత వెల్ఫేర్ కమిటీ ప్రతినిధులు తాళ్లపల్లి పీటర్, నల్ల రమేష్, తాళ్లపల్లి ప్రసన్న, ఇ. రాజు, సుదర్శన్, బోస్, పౌల్, టి. ప్రభాకర్, తాళ్లపల్లి జైపాల్, జోసెఫ్, బెనహర్, జైపాల్ జార్జ్ తదితరులు పాల్గొన్నారు.