09-09-2025 10:37:05 PM
గరిడేపల్లి (విజయక్రాంతి): మండల కేంద్రమైన గరిడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చంద్రశేఖర్(District Medical Health Officer Chandrashekhar) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని వార్డులను, ఫార్మసీలను ఆయన పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలోని రికార్డులను రోజువారి రిజిస్టర్ ను, డెలివరీ వివరాలను, గర్భిణీల రిజిస్టర్ ను ఆయన పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలో కాన్పులను ప్రోత్సహించాలని, ఫార్మసీ రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆయన ఆదేశించారు. జాతీయ కార్యక్రమాలకు సంబంధించిన లక్ష్యాలను ఆయన అడిగి వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి నరేష్, సూపర్వైజర్ వెంకటరమణ, స్టాఫ్ నర్స్ యశోద, ఫార్మసిస్ట్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.