calender_icon.png 10 September, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి ఇద్దరికి తీవ్ర గాయాలు

09-09-2025 10:42:17 PM

గరిడేపల్లి (విజయక్రాంతి): మండలంలోని రాయినిగూడెం గ్రామ శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందగా మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చింతలపాలెం మండలం ఎర్రగుంట తండా గ్రామానికి చెందిన భూక్య కృష్ణ తన తండ్రి బాధ్య,అత్త కమిలి మోటార్ సైకిల్ పై గరిడేపల్లి నుంచి హుజూర్నగర్ వైపుకు వెళుతుండగా ఎదురుగా వస్తున్న కారు ప్రమాదవశాత్తు ఢీకొనడంతో మోటార్ సైకిల్ పై ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం హుజూర్నగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో భూక్యా భాగ్య(60) చనిపోయాడు. గాయపడిన కృష్ణ కమీలిని మెరుగైన చికిత్స కోసం హుజూర్నగర్ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో కోదాడ ఆసుపత్రికి తరలించినట్లు గరిడేపల్లి ఎస్ఐ చలికంటి నరేష్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.