calender_icon.png 10 September, 2025 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రేడ్ ఎక్స్పో పోస్టర్ విడుదల

09-09-2025 10:44:53 PM

యాదగిరిగుట్ట (విజయక్రాంతి): ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ముందు హైదరాబాద్ ట్రేడ్ ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరించారు. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా, మండల నాయకులు పాల్గొని సెప్టెంబర్ 19, 20, 21 తేదీలలో ఓం కన్వెన్షన్ సెంటర్లో హైదరాబాద్ ట్రేడ్ ఎక్స్పో అంతర్జాతీయ ఫోటో, వీడియో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం వేడుకను సంబంధించి పోస్టర్ను ఆవిష్కరించారు. ఆధునిక టెక్నాలజీతో ఫోటో రంగంలో వస్తున్న మార్పులు ప్రతి ఒక్కరికి అందేలా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. ఏఐ టెక్నాలజీలో ఫోటోగ్రఫీ అనేది మరింత అద్భుతాలను సృష్టిస్తుందని సృష్టికి ప్రతి సృష్టి ఫోటోగ్రఫీ అని చెరిగిపోయే కాలానికి మరుపురాని గుర్తులను వివరించేది ఫోటోగ్రఫీ అని వారు తెలియజేశారు.