09-09-2025 09:37:26 PM
సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం.
నకిరేకల్ (విజయక్రాంతి): చిట్యాల-భువనగిరి ప్రధాన రహదారి గుంతలమయం కావడంతో వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం(CPM Mandal Secretary Boddupalli Venkatesham) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సిపిఎం ఆధ్వర్యంలో తుమ్మలగూడెం దగ్గర భువనగిరి ప్రధాన రోడ్డుపై నిరసన తెలిపారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం వేలాది అంతర్రాష్ట్ర వాహనాలు నడిచే ఈ ప్రధాన రోడ్డు సింగిల్ రోడ్డు కావడంతో రోడ్డు మొత్తం అత్యంత ప్రమాదకరంగా మారి గుంతల మయం అయ్యి నిత్యం ప్రమాదాలు జరుగుతూ ప్రాణాలు పోతున్నవని అన్నారు. ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన రోడ్డు దుస్థితి మారడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.రోడ్డు అంతా గుంతల మయంగా మారిన కనీసం ఆర్ అండ్ బి అధికారులు తాత్కాలికమైన మరమ్మత్తులు కూడా చేయడం లేకపోవడం ప్రభుత్వ పనితనానికి నిదర్శమని ఆయన అన్నారు.
రాత్రివేళ ద్విచక్ర వాహనాలు రావాలంటే భయాందోళన గురికావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నాలుగు రోడ్లుగా మంజూరు చేస్తామని చెప్పిన ప్రభుత్వ హామీ రెండు సంవత్సరాలు గడుస్తున్నా పూర్తి కాలేదని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నాలుగు రోడ్లుగా మార్చి తక్షణం ప్రమాదకరంగా మారిన గుంతలను వెంటనే పూడ్చాలని ప్రజల ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు బల్గూరి అంజయ్య, మండల కమిటీ సభ్యులు మీర్ ఖాజా అలీ, ఎండీ రషీద్,గొరిగే సోములు, పులి బిక్షం, గన్నెబోయిన శ్రీనివాస్, శానాగొండ వెంకటేశ్వర్లు, జనపాల లక్ష్మణ్,గుండాల ప్రసాద్,పావిరాల మత్స్యగిరి, అప్పం సురేందర్, కంటేశ్వర్ రమేష్, ఆముద ఆంజనేయులు, గుణగంటి మల్లేశం, జల్లెల మల్లేశం, గట్టు జ్యోతిబసు, గట్టు నర్సయ్య,జనపాల రాములు తదితరులు పాల్గొన్నారు.