calender_icon.png 10 September, 2025 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తక్కువ ఖర్చులో నాణ్యమైన ఇళ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం

09-09-2025 09:33:22 PM

జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ 

అయిజ: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఇళ్లు నిర్మించగలిగేలా సలహాలు ఇచ్చి, పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్(District Collector B.M. Santosh) అధికారులను ఆదేశించారు. మంగళవారం గద్వాల జిల్లా అయిజ మున్సిపల్ పరిధిలోని వార్డ్ నం.6 లో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మంజూరైన లబ్ధిదారులు చేపట్టిన ఇండ్ల నిర్మాణాలను తనిఖీ చేశారు. ఇంటి నిర్మాణం, పనులలో నాణ్యతను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్లలో మొత్తం 12 ఇళ్లకు మంజూరు అయినట్టు అందులో 5 రూఫ్ లెవెల్, 7 బేస్మెంట్ లెవెల్ ఉన్నట్లు అధికారులు కలెక్టర్ కు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ లబ్ధిదారుల నుండి ఇళ్ల నిర్మాణానికి ఏమైనా సమస్యలున్నాయా అని అడిగి తెలుసుకొని, పనులను వేగంగా పూర్తి చేయాలని,దశలవారీగా డబ్బులు ఖాతాలో వెంటనే జమ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సైదులు,మున్సిపల్ మేనేజర్ అశోక్ రెడ్డి, హౌసింగ్ ఎ.ఈ వంశీ,వార్డ్ ఆఫీసర్ భరత్,తదితరులు పాల్గొన్నారు.