calender_icon.png 17 November, 2025 | 10:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమానికి కాళోజీ మైలురాయి

10-09-2024 04:55:48 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమంలో కాళోజీ కవిత్వం, సాహిత్యం ఒక మైలురాయి లాంటిదని, అన్యాయాన్ని ఎదిరించిన వాడే తనకు ఆరాధ్యుడుగా భావించిన గొప్ప వ్యక్తి కాళోజీ అని పలువురు వక్తలు కొనియాడారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యం లో కాళోజీ 110 జయంతి వేడుకలు రవీంద్రభారతిలో సోమవారం ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ గొడవను తన గొడవగా చెప్పుకోవడమే గాకుండా, అన్యాయా న్ని ఎదిరించిన వాడే తనకు ఆరాధ్యుడుగా ప్రకటించిన గొప్ప వ్యక్తి కాళోజీ అని పేర్కొన్నారు. కాళోజీ ఆశయాలను నెరవేర్చడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. ప్రముఖ కవి అందెశ్రీ మాట్లాడు తూ.. కాళోజీ తెలంగాణ ఉద్యమంలో మైలురాయి లాంటి వాడన్నారు. కార్యక్రమంలో భాషా, సాంస్కృతిక సంచాలకులు మామిడి హరికృష్ణ, నేటి నిజం పత్రిక ఎడిటర్ బైసా దేవదాసు, ప్రముఖ కథా రచయిత్రి గోగు శ్యామల, మౌనశ్రీ మల్లిక్ తదితరులు పాల్గొన్నారు.