20-11-2025 12:00:00 AM
ఇటీవల జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన చిత్రం ‘లోక’ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ నుంచి మరో సినిమా రానుంది. పొటెన్షియల్ స్టూడియోస్ బ్యానర్‌పై ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్ ప్రభు, పీ గోపీనాథ్, తంగప్రభహరన్ ఆర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇందులో కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటిస్తుండగా నాన్ మహాన్ అల్లా ఫేమ్ దేవదర్శిని, వినోద్ కిషన్ కీలక పాత్రలు పోషించనున్నారు.
నూతన దర్శకుడు ధీరవియం ఎస్‌ఎన్ దర్శకత్వంలో రూపొందుతుండగా, ప్రవీణ్ భాస్కర్, శ్రీకుమార్ దర్శకుడితోపాటు స్క్రీన్‌ప్లే సంభాషణలు రాశారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం, గోకుల్ బెనోయ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అరల్ ఆర్ తంగం ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.