20-11-2025 12:00:00 AM
రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. మైత్రిమూవీమేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్‌బాబు పీ దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయి కగా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
కర్నూలు ఈవెంట్‌లో హీరో రామ్ మాట్లాడుతూ.. “ఇప్పటి వరకు మాస్ సినిమాలు చేశాను. ఇది నాకు చాలా ఎమోషనల్ ఫిలిం. ఎప్పట్నుంచో నా మనసులో ఉన్న ఆలోచనలన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. ఇది అభిమానుల సినిమా. భాగ్యశ్రీ అద్భుతంగా నటించింది. గ్లామరస్‌గా కనిపిస్తూ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసే హీరోయిన్ తెలుగు సినిమాలో చాలా ఏళ్ల తర్వాత వచ్చిందని భావిస్తున్నా” అన్నారు.
భాగ్యశ్రీ మాట్లాడుతూ.. “రామ్ ఈ సినిమా కోసం తన బెస్ట్ ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా చాలా మంచి ఫలితాన్నిస్తుంది” అని చెప్పింది. ‘ఏదో ఒక డిఫరెంట్ కంటెంట్ ఇవ్వాలని చాలా నమ్మి ఈ సినిమాని చేశామ’ని నిర్మాత రవిశంకర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మహేశ్‌బాబు, సంగీత దర్శకులు వివేక్ చిత్రబృందం పాల్గొన్నారు.