13-09-2025 01:46:33 AM
పవన్‌కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమాలో ఓ ముఖ్యపాత్రలో నటించడం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది సంయుక్త మీనన్. ముఖ్యంగా కళ్యాణ్‌రామ్‌తో ఈ బ్యూటీ జత కట్టిన ‘బింబిసార’ భారీ విజయాన్ని అందుకుంది. దాంతో టాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ, ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగింది. తెలుగులో చివరగా 2023లో ‘డెవిల్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకువచ్చింది. కమర్షియల్‌గా నిరాశ పరిచినప్పటికీ సంయుక్త కెరీర్‌లో స్పెషల్ మూవీగా మారింది.
ఆ తర్వాత ఎన్ని అవకాశాలు వచ్చినా సెలెక్టెడ్‌గా సినిమాలు చేస్తున్న కారణంగా ఏడాదిన్నరగా తెరపై కనిపించట్లేదు. కానీ, 2024 ద్వితీయార్ధం నుంచి వరుస సినిమాలకు కమిట్ అవుతూ వచ్చింది. ప్రస్తుతం సంయుక్త చేతిలో ఏడు సినిమాలున్నాయి. తెలుగులో బాలకృష్ణ ‘అఖండ2’లో హీరోయిన్‌గా నటిస్తోంది. నిఖిల్ సిద్ధార్థకు జోడీగా నటిస్తున్న ‘స్వయంభు’ విడుదల కావాల్సి ఉంది. శర్వానంద్‌తో కలిసి చేస్తున్న ‘నారి నారి నడుమ మురారి’ సినిమా షూటింగ్ ఇప్పుడు వేగంగా జరుపుకొంటోంది.
మరోవైపు ‘పూరి-సేతుపతి’ ప్రాజెక్టులో ఈ అమ్మడు ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఇంకా హిందీలో ఒకటి, తమిళంలో మరొకటి, మలయాళంలో మరో సినిమా చేస్తోంది. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంటే.. రాబోయే రోజుల్లో సంయుక్త టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా నిలిచే అవకాశాలు దండిగా ఉన్నాయంటూ తాజాగా సెప్టెంబర్ 11న ఈ భామ పుట్టినరోజు సందర్భంగా ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ సాగింది.