calender_icon.png 22 December, 2025 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోదీకి లేఖ రాయాలి

22-12-2025 01:28:58 AM

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్

హైదరాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీకి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాయడంపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. సోనియాకు లేఖ రాసిన కిషన్‌రెడ్డి.. ప్రధాని మోదీ ఇచ్చిన హామీలపై ఆయనకు ఎందుకు లేఖ రాయలేదని నిలదీశారు. కిషన్‌రెడ్డి రాసిన లేఖకు విలువలే దన్నారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. బీజేపీని గెలిపిస్తే విదేశాల్లో ఉన్న నల్ల ధనాన్ని తీసుకొచ్చి దేశంలోని పేదలకు ఒక్కోక్కరికి రూ.15 లక్షలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 11 ఏళ్లు పూర్తయినా మోదీ మాట నిలబెట్టుకోలేదన్నారు.