calender_icon.png 13 May, 2025 | 11:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలతో శారీరక మానసిక దృఢత్వం

06-05-2025 12:00:00 AM

పోలీస్ సమ్మర్ క్యాంప్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 

ఆదిలాబాద్, మే 5 (విజయక్రాంతి):  వేసవి కాలంలో పిల్లలకు ఆటవిడుపుగా ఉం డాలని, చెడు వ్యసనాలకు అలవాటు కాకుం డా ఉండడానికి ఈ సమ్మర్ క్యాంప్ లను నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రత్యేకంగా ఆదివాసీలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందా లని చిన్ననాటి నుండి విద్యార్థినీ విద్యార్థులకు వ్యాయామం శిక్షణ అందిచి ఉన్నత స్థానాలకు ఎదగాలేని ఆకాంక్షించారు. 

జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో నాలుగు చోట్ల  నెల రోజుల పాటు నిర్వహించే సమ్మర్ క్యాంపును సోమవారం ఆదిలాబాద్‌లోని పోలీస్ హెడ్ క్వార్టర్‌లో ఎస్పీ ప్రారంభించారు. ఈ సమ్మర్ క్యాంపు లు  ఆదిలాబాద్ లోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్, ఇచ్చోడ పోలీస్ స్టేషన్, ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్, నార్నూర్ పోలీస్ స్టేషన్‌లలో ఏకకాలంలో ప్రారంభించడం జరిగింది. 

ఈ మేర కు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ యువత, చిన్నారులకు ఒకే అంశంపై పదేపదే శిక్షణను అందించడం ద్వారా వారు ఆ కళనందు నిష్ణాతులై ఉన్నత స్థానానికి ఎదుగుతారని తెలిపారు. ముఖ్యంగా ఆటల వల్ల పిల్లలకు విద్యార్థినీ విద్యార్థులకు మానసిక శారీరక దృఢత్వం లభిస్తుందని తెలిపారు. సమ్మర్ క్యాంపు ద్వారా పిల్లలకు ఆటవిడుపుగా ఉంటుందని అన్ని రంగాలలో సరైన శిక్షణను అందించడం జరుగుతుందని తెలిపా రు.

ఈ సమ్మర్ క్యాంపులో పోలీసుల ఆధ్వర్యంలో యోగ, కరాటే, కబడ్డీ, క్రికెట్, వాలీ బాల్, బాస్కెట్ బాల్, పిఈటీ తోపాటు సమ్మర్ క్యాంపులో పలు రోజులు పోలీస్ స్టేషన్ సందర్శన, నిర్వహణ, జైలు సందర్శన, పోలీస్ ల ఆయుధా ల ఉపయోగం, వాటి పనితీరుపై, జిల్లా పోలీసులు తీసుసునే కటోర శిక్షణపై ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి సురేందర్రావు, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, వన్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు సిహెచ్ కరుణాకర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వెంకటి, ఎన్ చంద్రశేఖర్, కరాటే మాస్టర్ ప్రవీణ్, యోగ మాస్టర్, పీఈటి సందీప్, రిజర్వ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.