calender_icon.png 13 January, 2026 | 8:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెమీస్‌లో కర్ణాటక, సౌరాష్ట్ర

13-01-2026 12:00:00 AM

విజయ్ హజారే ట్రోఫీ

బెంగళూరు, జనవరి 11  : విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక, సౌరాష్ట్ర సెమీఫైనల్‌కు చేరుకున్నా యి. క్వార్టర్ ఫైనల్లో కర్ణాటక ముంబై ని ఓడిస్తే.. సౌరాష్ట్ర ఉత్తర్‌ప్రదేశ్‌కు చెక్ పెట్టింది. మొదటి క్వార్టర్ ఫైనల్లో ముంబై 50 ఓవర్లలో 254 పరుగులు చేసింది. షమ్స్ ములానీ 86, సిద్దేశ్ లాడ్ 38, సాయిరాజ్ పాటిల్ 33 తప్పిస్తే మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. ఛేజింగ్‌ల మయాంక్ అగర్వాల్(12) నిరాశపరిచినా ఫామ్‌లో ఉన్న దేవదత్ పడిక్కల్(81), కరుణ్ నాయర్(74) అదరగొట్టారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 143 పరుగులు జోడించారు. అయితే వెలుతురు మందగించడంతో 33 ఓవర్ల దగ్గర మ్యాచ్ నిలిచిపోయింది. దీంతో వీజేడీ పద్ధతిలో అప్పటికే ముందంజలో ఉన్న కర్ణాటక 55 పరుగుల తేడాతో గెలిచింది.

మరో మ్యాచ్‌లో ఉత్తర్‌ప్రదేశ్ 50 ఓవర్లలో 310 పరుగుల భారీస్కోరు చేసింది. అభిషేక్ గోస్వామి(88), సమీర్ రిజ్వి 88 నాటౌట్ రాణించారు. ఛేజింగ్‌లో  సౌరాష్ట్ర కూడా దూకుడుగానే ఆడింది. కెప్టెన్ హర్విక్ దేశాయ్ (100) అజేయ సెంచరీకి తోడు ప్రేరాక్ మన్కడ్ (67), చిరాగ్ జని (40 నాటౌట్) రాణించారు. అయితే 40 ఓవర్ల దగ్గర వర్షంతో మ్యాచ్ నిలిచిపోయింది. దీంతో వీజేడీ పద్ధతిలో సౌరాష్ట్రా 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. మంగళవారం జరిగే మరో రెండు క్వార్టర్ ఫైనల్స్‌లో ఢిల్లీ, విధర్భతోనూ , పంజాబ్, మధ్యప్రదేశ్‌తోనూ తలపడతాయి.