calender_icon.png 13 January, 2026 | 8:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజ్వాన్ జిడ్డు బ్యాటింగ్

13-01-2026 12:00:00 AM

పాక్ క్రికెటర్ రిటైర్డ్ ఔట్

సిడ్నీ, జనవరి 12 : టీ ట్వంటీ అంటే ఫోర్లు, సిక్సర్లు బాదే బ్యాటర్లకే ప్రాధాన్యత ఉంటుంది.. అలా కా కుండా వన్డే, టెస్ట్ తరహాలో సింగిల్స్ తీస్తూ, బం తులు వృథా చేయడం పొట్టి క్రికెట్‌కు సరిపోదు. తాజాగా బిగ్‌బాష్ లీగ్‌లో ఇలా జిడ్డు బ్యాటింగ్‌తో విసిగించిన పాక్ క్రికెటర్ మ హ్మద్ రిజ్వాన్‌ను మెల్‌బోర్న్ రెనెగేడ్స్ టీమ్ మేనేజ్‌మెంట్ రిటైర్డ్డ్ ఔట్‌గా వెనక్కి రప్పించింది. సిడ్నీ థండర్స్‌తో జరిగిన మ్యాచ్ లో రిజ్వాన్ నిదానంగా బ్యాటింగ్ చేశాడు. 23 బంతుల్లో 26 పరుగులే చేశాడు. చివర్లో కూడా జిడ్డు బ్యాటింగ్ చేస్తుండడంతో విసుగెత్తిన మెల్‌బోర్న్ టీమ్ అతన్ని బయటకు పిలిచింది. దీంతో బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో రిటై ర్డ్ ఔట్ అయిన తొలి క్రికెటర్‌గా చెత్త రికార్డు ను సొంతం చేసుకున్నాడు.

ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ రిజ్వాన్ పేలవ ప్రదర్శనే కనబరిచాడు. 8 మ్యాచ్‌లలో కేవలం 167 పరుగులే చేశాడు. దీంతో భారీధర పెట్టి కొనుగోలు చేసిన మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌కు అతను తన చెత్త బ్యా టింగ్ తో షాకిచ్చాడు. ఇలా జిడ్డు బ్యాటింగ్ చేస్తే అలా నే వెన క్కి పిలుస్తారంటూ నెటిజన్లు రిజ్వాన్‌ను ట్రోల్ చేస్తున్నారు. అటు మరో పాక్ క్రికెటర్ బాబర్ అజామ్ కూడా బిగ్‌బాష్ లీగ్‌లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. దీంతో పాక్ ఆటగాళ్లను నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు.