calender_icon.png 3 May, 2025 | 8:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగు ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంది

02-05-2025 12:00:00 AM

నాని హీరోగా నటించిన చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. శ్రీనిధిశెట్టి హీరోయిన్‌గా నటించింది. డాక్టర్ శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. మే 1న పాన్ ఇండియాగా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో హీరో నాని మాట్లాడుతూ.. “ఇది జస్ట్ బిగినింగ్ ఆఫ్ హిట్ 3 జర్నీ. ఇది ఇప్పుడిప్పుడే ఆగదు.

అందుకే ఎలాంటి సేట్‌మెంట్ ఇవ్వదల్చుకోలేదు. ఈ సినిమాకు కనీసం నాలుగైదు సెలబ్రేషన్స్ చేయాలి. ఈసారి నేను ప్రొడ్యూసర్ కూడా కాబట్టి అదనపు బాధ్యత ఉంది. నేను మీరు ఒకటేనని నమ్మిన ప్రతిసారి మీరు నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసినందుకు అందరికీ థాంక్యూ. ఈరోజు రాత్రి అమెరికా వెళుతున్నా. వచ్చిన వెంటనే మీ అందరిని కలుసుకొని గ్రాండ్‌గా సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకుందాం. ఇది తెలుగు సి నిమా సక్సెస్‌” అన్నారు.

నిర్మాత దిల్ రాజ్ మాట్లాడుతూ.. ‘ఆడియన్స్ థియేటర్స్‌కు రావడం లేదు, సమ్మర్ అయిపోతోంది అనుకుంటున్న తరుణం.. ఏప్రిల్ నెలలో సరైన సినిమాలు లేక చాలా సింగిల్ స్క్రీన్స్ ఏపీ, తెలంగాణలో క్లోజ్ చేశారు. ఇలాంటి సమయంలో ఈ సినిమాకు మూడు రోజులు ముందుగానే ఆన్‌లైన్ బుకింగ్ చూసి జనాలు థియేటర్స్‌కు వస్తున్నారని హ్యాపీగా ఫీలయ్యా. దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకున్నట్టు అయింది.

మంచి సినిమా ఇస్తే చూడ్డానికి మేము సిద్ధంగా ఉన్నామని ఆడియన్స్ మళ్లీ మాకు ఎనర్జీ ఇచ్చారు. కచ్చితంగా మా వంతు కూడా బాధ్యత ఉంది. ఎప్పటికప్పుడు మీకు కొత్త సినిమాలిచ్చి మీ మిమల్ని థియేటర్స్‌కు తీసుకు రావడానికి ఆలోచిస్తున్నాం’ అని చెప్పారు.

డైరెక్టర్ శైలేశ్ కొలను మాట్లాడుతూ.. ‘సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందంగా అనిపించింది. టీమ్ అంతా కలిసి చాలా కష్టపడ్డాం’ అని తెలిపారు. డీవోపీ షాన్ వర్గీస్ మాట్లాడుతూ.. ‘ఇలాంటి మాస్ సినిమాను థియేటర్స్‌లో కూర్చుని ఆడియన్స్ అందరితో ఎక్స్‌పీరి యన్స్ చేయడం ఇది నాకు ఫస్ట్ టైమ్. ఆడియన్స్  రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది’ అన్నారు.