calender_icon.png 6 November, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శైవక్షేత్రాల్లో కార్తీక పూజలు

06-11-2025 12:07:01 AM

- రాముని బండలో కిక్కిరిసిన భక్తులు

- కోదండ రామయ్య కాపాడు స్వామి అంటూ కార్తీక పౌర్ణమి భక్తుల ప్రత్యేక పూజలు

- ఆలయ రాజా గోపురం నిర్మాణానికి దాతలు ముందుకు రావాలి

జదేవపూర్, నవంబర్ 5.జగదేవపూర్ మండల పరిధిలోని జంగంరెడ్డి పల్లి గ్రామంలో సీతారాములా ఆలయం పూర్వం అరణ్య వాసం చేసే సమయంలో సీతారాములు ఈ ప్రదేశంలో రెండు రోజులు బస చేసారని సీతమ్మ వారికీ దాహం వేస్తే శ్రీరాముడు, లక్ష్మనుడు వరి బాణాలతో బావి తవ్వి సీత్తమ్మ వారి దాహం తీర్చినట్టు ఆలయం అర్చకులు తెలిపారు.

పూర్వం ప్రజలకు ఏదయినా చర్మ రోగాలు వచ్చిన, పంట చేనుకు చీడ పిడలు పట్టిన ఆలయ ప్రాంగణంలోని బావిలో నీటితో స్నానం ఆచరించిన అన్ని రోగాలు పోయేవి అని నమ్మిక. శ్రీరాముడు స్వయంబు వేలిసిన ప్రదేశాలు భద్రాచలం, జీడికల్ మరొకటి రాముని బండ అని తెలిపారు. కోరిన కోర్కెలు తీర్చే కోదండ రాముని ఆలయం ముందు రాజా గోపురం నిర్మాణానికి దాతలు ముందుకు రావాలి అని ఆలయం కమిటీ సభ్యులు తెలిపారు.

అనంతరం స్థానిక ఎస్ ఐ కృష్ణ రెడ్డి మాట్లాడుతూ భక్తుల తాకిడి ఎక్కువ ఉంది అని ఏలాంటి అవంచానియా సంఘటనలు జరగకుండా పాటిష్ట బందో బస్తూ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.మాజీ సర్పంచ్ కుమార్ మాట్లాడుతు శ్రీరామచంద్ర స్వామి మా గ్రామంలో వెలియడం సంతోషంగా ఉంది అని అన్నారు. యేటా కార్తీక పౌర్ణమి రోజు గర్భ గుడిలో స్వామి వారికి ప్రత్యేక పూజలు ఉంటాయి అని అన్నారు. భక్తులకు ఏలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పూజ కార్యక్రమంలో నిర్మాణం దాతలు రవీందెర్ రెడ్డి,జగన్ నిజవాసచార్యులు, అర్చకులు అభినయ్ కుమార్ గ్రామ నాయకులు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

మర్పడగ లో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు: నవావరణ హవనంలో పాల్గొన్నల కలెక్టర్ కే హైమవతి 

కొండపాక, నవంబర్ 05:కొండపాక మండలం మర్పడగ గ్రామంలోని శ్రీ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో బుధవారం కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్షేత్ర నిర్వాహకులు చెప్పెల హరినాథశర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమవతి పాల్గొన్నారు.ఉత్సవాలు ఉదయం ఎనిమిది గంటలకు గణపతి పూజతో ప్రారంభమయ్యాయి.సంతాన మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తులు అభిషేకాల్లో పాల్గొని,విజయదుర్గామాతకు విశేష పూజలు నిర్వహించి, పట్టువస్త్రాలతో అలంకరించారు.

అనంతరం సుబ్రహ్మణ్య స్వామికి విశేష పంచామృత ఫలరస అభిషేకం నిర్వహించారు. పూజలు, అభిషేక కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ హైమవతి పాల్గొన్నారు క్షేత్రం ఆవరణలోని ఉసిరి చెట్టు వద్ద భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు.కొందరు భక్తులు లక్ష వత్తులతో దీపాలు వెలిగించి మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం జరిగిన నవావరణ హవనంలో జిల్లా కలెక్టర్ హైమవతి పాల్గొన్నారు. అనంతరం అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమం లో క్షేత్ర నిర్వహణా కమిటీ సభ్యులు చీకోటి రాజేంద్రప్రసాద్, దేవసాని మల్లేశం,లగిశెట్టి రాజు, మర్యాల రవీందర్, తదితరులు పాల్గొన్నారు

 శివాలయాల్లో ఘనంగా కార్తీక దిపోత్సవం

సంగారెడ్డి/మెదక్, నవంబర్ 5(విజయక్రాంతి):కార్తీక పౌర్ణమి పండగ పర్వదినం సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి ఆయా జిల్లాల్లోని శైవ క్షేత్రాల్లో శివాభిషేకాలు, అర్చనలు ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లాలోని ఝరాసంగం సంగమేశ్వర ఆలయంలో భక్తులు పోటెత్తారు. పూజా కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, వివిధ జిల్లాలకు చెందిన న్యాయమూర్తులు హాజరయ్యారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. అలాగే సంగారెడ్డి పట్టణంలోని ఆయా శివాలయాల్లో అర్చనలు, అభిషేకాలతో మారుమ్రోగింది. పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశంలోని ఇంద్రేశ్వర ఆలయంలో, గుమ్మడిదలలోని వీరభద్రస్వామి ఆలయంలో భక్తులు దీపారాధన, అభిషేకాలు చేశారు. జిల్లాలోని ఏడుపాయల దేవస్థానంలో వేలాదిగా భక్తులు తరలివచ్చి కార్తీక దీపారాధన చేశారు. మెదక్ మండలం కూచన్పల్లి గ్రామంలోని సిద్దేశ్వరాలయంలో వందలాదిగా భక్తులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆయా దేవాలయాల్లో జిల్లాలోని రాజకీయ నేతలు, అధికారులు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. 

మల్లన్న ఆలయంలో ఘనంగా లక్షదీపోత్సవం 

 కొమురవెల్లి, నవంబర్ 5 ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం లో కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని బుధవారం రాత్రి లక్ష దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ అర్చకులు గర్భాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం, సహస్త్ర బిల్వార్చన, అన్న పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు గంగరేని చెట్టు కిందగంగరేని చెట్టు కింద ఉత్సాహమూర్తులను తీసుకొచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరంసామూహిక లక్ష దీపోత్సవాన్ని కార్యనిర్వహణ అధికారి, టంకశాల వెంకటేష్, ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్ ప్రారంభించారు. శివుని ప్రతిరూపాన్ని చిత్రీకరించి, ఆ చిత్రం చుట్టూ ప్రమిదలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలతో పాటు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలను వెలిగించారు. లక్ష దీపాలూ వెలిగించడంతో గంగ రేణు చెట్టు ఆవరణం వెలుగులతో విరజిల్లింది.

శివనామ స్మరణతో మారు మోగిన బీరంగూడ శివాలయం...!

అమీన్ పూర్, నవంబర్ 5 :అమీన్ పూర్ బీరంగూడెం గుట్ట శ్రీ భ్రమరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. బుధవారం ఉదయం నుంచే ఆలయ ఆవరణలో భక్తులు దీపాలు వెలిగిస్తూ మొక్కులు తీర్చుకున్నారు.

కార్తీక పౌర్ణమిని అత్యంత ప్రీతికరమైన రోజుగా భక్తులు భావిస్తారని చైర్మన్ సుధాకర్ యాదవ్, ఈవో శశిధర్ గుప్తా, ఆలయార్చకులు తెలిపారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తూ శివనామ స్మరణతో ఆలయం మారుమ్రోగింది. జ్వాలాతోరణం, లక్ష దీపోత్సవము, పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు లక్షకు పైగా భక్తులు స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారని తెలిపారు. 

మాజీ వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ..

కార్తీక పౌర్ణమి పర్వదినం పురస్కరించుకొని అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ శివాలయం గుట్టపైన బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్, వారి కుటుంబ సభ్యులు ఉదయం 11 నుండి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం కొనసాగిస్తున్నట్లు నరసింహా గౌడ్ తెలిపారు. భగవంతుడి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.