calender_icon.png 6 November, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

06-11-2025 01:37:10 AM

లక్షెట్టిపేట, నవంబర్ 5: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచి జాతీయ స్థాయికి ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ రామా కళ్యాణి బుధవారం తెలిపారు. మహబూబబాద్ జిల్లా నెల్లికుదురులో నిర్వహించిన రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో లక్షెట్టిపేట గురుకుల పాఠశాల నుంచి జమిడి ప్రవళిక అద్భుత ప్రదర్శన కనబరచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు.

ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో జరగబోయే జాతీయ షూటింగ్ బాల్ పోటీల్లో రాష్ట్ర జట్టు తరపున పాల్గొంటారన్నారు. పీఈటీ డి. రమాదేవి, సిహెచ్ మమతలను ఈ సందర్భంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.