06-11-2025 01:30:54 AM
లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ మంజూరు పత్రాల పంపిణీ
రంగారెడ్డి, నవంబర్ 5( విజయక్రాంతి): ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత ఇంటి కలను నెరవేర్చాలని ఉద్దేశంతో ఇందిరమ్మండ్ల పథకానికి శ్రీకారం చుట్టి అమలు చేస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం మినిస్టర్ క్యాంప్ కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజక వర్గంలో మంఖాల్ I& II 2848 నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు అలాట్మెంట్ మరియు పంపిణీ చేసిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో కోర్టు కేసు ఉండటం వలన మంఖాల్-I మరియు మంఖాల్-II 2BHK ఇండ్ల పంపిణీ కార్యక్రమం ఆగిపోయిందని కోర్టులో కేసు త్వరగా పరిష్కారం అయ్యే విధంగా ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చొరవ తీసుకొని, పెండింగ్ లో ఉన్న 2848 మందికి డబల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేసినట్లు తెలిపారు.
స్వంత ఇల్లు లేని నిరుపేదల కలలు నెరవేర్చే ఉద్దేశంతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందించడం జరుగుతుందని ఆయన చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించి డబల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మంజూరు పత్రాలు అందుకున్న పలువురు లబ్ధిదారులు ప్రభుత్వానికి, మంత్రి శ్రీధర్ బాబుకు, నియోజకవర్గ ఇన్చార్జి కెఎల్‌ఆర్, జిల్లా అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాయక్, కందుకూర ఆర్ డి ఓ కే జగదీశ్వర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.