calender_icon.png 31 December, 2025 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్‌కు కారుకొండ పాఠశాల

31-12-2025 12:10:37 AM

నాగర్ కర్నూల్ డిసెంబర్ 30 ( విజయక్రాంతి ): జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం కారకొండ ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన 6వ తరగతి విద్యార్థి డి.వైష్ణవి చేత ప్రదర్శించిన సుస్థిర వ్యవసాయ అభివృద్ధి (నిలువ వ్యవసాయ పద్ధతి) అనే అంశంలో మొదటి బహుమతి సాధించి రాష్ట్రస్థాయి సైన్స్ ఫెర్ కు ఎంపికయింది.

ఈ సందర్భంగా డీఈవో రమేష్ కుమార్ పాఠశాల అధ్యాపక బృందం విద్యార్థికి బహుమతి ప్రధానం చేశారు. హెచ్ ఎం రామకృష్ణ, ఉపాధ్యాయులు రామకృష్ణ, భాగ్యలక్మి, శ్రీకాంత్, ఇంద్రాణి, లావణ్య, భారతి విద్యార్థులు నిహారిక, వైష్ణవి, మధు, అభిలాష్ వైష్ణవిని అభినందించారు.