calender_icon.png 31 December, 2025 | 8:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్సు సౌకర్యం కల్పించాలి

31-12-2025 12:11:39 AM

మాగనూరు, డిసెంబర్ 30: మాగనూరు మండలం నేరేడు గుమ్ము గ్రామం మీదుగా ఉజ్జి ల్లి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరాతు  నారాయణపేట డిపో మేనేజర్ లావణ్య గారికి నేరడ గమ్ము , ఉజ్జుల్లి, గ్రామ సర్పంచ్ లు, ఉప సర్పంచ్లు నాయకులు మంగళవారం వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఈ యొక్క గ్రామాల మీదుగా బస్సు సౌకర్యము ఉండేది అన్నారు.

ప్రస్తుతం బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రతి సంవత్సరం పై చదువుల కోసం విద్యార్థులు మక్తల్, నారాయణపేట, పట్టణాలకు చదువుల కోసం వెళ్లలేక చదువులకు దూరం అవుతున్నారు అన్నారు, ప్రైవేట్ వాహనాల్లో పరిమితికి మించి ఎక్కువ ప్రయాణికులను కూర్చోబెట్టడం ద్వారా ఎప్పుడు ఈ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థులు భయముతో చదువుకు దూరమవుతున్నారు అన్నారు.

అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని వారు కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో మాజీ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ ఎం రాజు, డి ప్రకాష్ సోమనాథ్ తదితరులు పాల్గొన్నారు.