22-11-2025 12:10:08 AM
శస్త్ర చికిత్స నిర్వహించిన డా కె. నాగర్జున బృందం
ముషీరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): ప్రభుత్వ సంస్థలో మొదటి బాల్య ల్యాపరాస్కోపిక్ స్త్రీనెక్టమీని గాంధీ ఆసుపత్రి పీడియాట్రిక్ సర్జరీ విభాగం, ప్రొఫెసర్ డా.కె.నాగర్జున నాయకత్వంలో ఈనెల 7న అక్నేపల్లి గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలుడు అఖిల్, రవి సూరా కుమారుడిపై విజయవంతంగా నిర్వహించింది. అఖిల్ కు 3 నెలల వయసులోనే హెరిడిటరీ స్పెరోసైటోసిస్గా నిర్ధారణ అయింది.
ఆయనను ఎంజీఎం ఆసుపత్రి వరంగల్ నుంచి భారీ స్క్రీన్ పెరుగుదల, జాండిస్, తీవ్రమైన రక్తహీనత లక్ష ణాలతో, ప్రతి 7-10 రోజులకు రక్త మార్పిడి అవసరం ఉన్న పరిస్థితిలో గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. హెరిడిటరీ స్పెరోసైటోసిస్ వంటి హీమటోలాజికల్ వ్యాధుల్లో రక్తస్రావ ప్రమాదం అధికంగా ఉండటం, ఓపెన్ సర్జరీకి మారాల్సిన అవసరం రావొచ్చన్న నేపథ్యంలో ల్యాపరాస్కోపిక్ స్త్రీనెక్టమీ అత్యం త క్లిష్టమైన, నైపుణ్యం అవసరమైన శస్త్రచికిత్స. ఈ క్లిష్టత, అధిక శస్త్రచికిత్స వ్యయాల కారణంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇది అరుదుగా నిర్వహించబడుతుంది.
గాంధీ ఆసుప త్రి పీడియాట్రిక్ సర్జరీ విభాగం ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు కూడా అధునాతన, సురక్షిత శస్త్రచికిత్సలను ఉచితంగా అంది స్తూ, క్లిష్టమైన శస్త్రచికిత్సలు అందరికీ చేరువ చేస్తోంది. ఈ మినిమల్ ఇన్వేసివ్ పద్ధతి వల్ల నొప్పి తగ్గడం, ఊపిరితిత్తుల, ఇన్ఫెక్షన్ సంబంధిత సమస్యలు తగ్గడం, వేగవంతమైన కోలిక, అతి తక్కువ మచ్చలు వంటి అనేక ప్రయోజనాలు లభిస్తాయి.
ఈ శస్త్రచికిత్సను నిబద్ధత గల శస్త్రచికిత్స బృందమైన డా.కె.నాగర్జున, డా.మనోజ్ కుమార్, డా. విష్ణు వర్ధన్ రెడ్డి, డా.పవన్ రావు, డా.అశ్రిత్ రెడ్డి, డా.హర్ష, డా.సాజిద్ విజయవంతంగా పూర్తి చేశారు. అనస్తీషియా విభాగం నుండి ప్రొఫెసర్ డా.ఆవుల మురళి, డా.బభిత గొప్ప సహకారం అందించారు. ఓటీ సిబ్బందిలో సిస్టర్ అరుణ, వార్డ్ సిబ్బందిలో సిస్టర్ సువర్ణ నేతృత్వం అమూల్యమైనది. తమ నిరంతర మద్దతుకు మెడికల్ సూపరింటెండెంట్ డా.ఎన్.వాణి, ఆసుపత్రి పరిపాలనకు బృందం కృతజ్ఞతలు తెలిపారు.