22-11-2025 12:12:12 AM
ముషీరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): ప్రమాదవశాత్తు హాస్టల్ భవనం మూడో అంతస్తు నుంచి కిందపడి సివిల్స్ ప్రిపేర్ అవుతున్న యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధి లోని అశోక్ నగర్ హోం నగర్ ప్రాంతంలోని లోటస్ బాయ్స్ హాస్టల్లో ఉంటున్న బాసని ఆనంద్ (26) గత రెండు సంవత్సరాలుగా అశోక్ నగర్ లోని పలు సివిల్స్ కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటూ హాస్టల్లో ఉంటున్నాడు.
భూపాలపల్లి జిల్లాకు చెందిన అంబడపల్లి గ్రామం నివాసి ఆనంద్ లోటస్ హాస్టల్ మూడో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు ఒక్క హాస్టల్ భవనంలోకి రేకుల షెడ్డుపై పడి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలైన బాసని ఆనంద్ ను చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు దోమలగూడ సిఐ మహమ్మద్ అంజద్ అలీ తెలిపారు. హాస్టల్ మూ డో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు పడ్డా డా, లేక మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకున్నాడా, మరి ఏమైనా కారణాలు ఉన్నా యా అంటూ పలుకోనాల్లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు దోమలగూడ పోలీసులు తెలిపారు.