calender_icon.png 8 July, 2025 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గీతకార్మిక శాఖ ఇన్‌చార్జిగా కత్తి వెంకటస్వామిగౌడ్ బాధ్యతల స్వీకరణ

08-07-2025 12:36:20 AM

సనత్‌నగర్ జూలై 7 (విజయ క్రాంతి):- గీతకార్మిక శాఖ నూతన ఇన్‌చార్జిగా శ్రీ కత్తి వెంకటస్వామి గౌడ్ ఈరోజు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, “గీతకార్మికుల అభ్యున్నతి మరియు సంక్షేమం నా ప్రధాన లక్ష్యాలు. ఈ శాఖను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాను” అని తెలిపారు.

ఈ బాధ్యతను అప్పగించినందుకు తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి కి మరియు గౌరవ మంత్రి  పోన్నం ప్రభాకర్ కి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా కేశం నాగరాజ్ గౌడ్, శంభుల శ్రీకాంత్ గౌడ్, ఐల మధు గౌడ్ లు కలిసి ప్రత్యేకంగా ఒక సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.