calender_icon.png 8 July, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిమ్‌క్విన్ జిమ్నాస్టిక్స్‌లో ది గాడియం స్కూల్‌కు పథకాలు

08-07-2025 12:34:41 AM

ముషీరాబాద్, జూలై 7 (విజయక్రాంతి) : జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్ ఈవెంట్ ‘జిమ్‌క్విన్ 2025’ రెండో ఎడిషన్ లో ది గాడియం స్కూల్ అద్భుతమైన ప్రదర్శనతో అత్యధిక పతకాలను సాధించి అగ్రస్థానంలో నిలిచిందని స్కూల్ డైరెక్టర్ కె.కీర్తి రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఆమె మాట్లాడుతూ 15 రాష్ట్రాలకు చెందిన 850 మంది యువ జిమ్నాస్ట్‌లు రిథమిక్ జిమ్నాస్టిక్స్, డ్యాన్స్ జిమ్నాస్టిక్స్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, ఫ్లోర్ రొటీన్స్ గ్రూప్ అక్రోబాటిక్స్ ఈవెంట్లలో తమ ప్రతిభను ప్రదర్శించారన్నారు. సోమవారం జరిగిన ముగింపు వేడుకలో విన్నర్లకు మెడల్స్ అందజేసినట్లు చెప్పారు.