22-12-2025 12:56:47 AM
చిట్యాల, డిసెంబర్ 21 : ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురై యువకుడు మృతి చెందిన ఘటన శనివారం రాత్రి మండలంలోని ఉరుమడ్ల గ్రామ శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా, ఇంకొల్లు మండలం, ఇడుపులపాడు గ్రామానికి చెందిన పురిమిట్ల అక్షయ్ (26) తన భార్యతో కలిసి గత కొన్ని రోజులుగా మునుగోడు మండలంలోని ఇప్పర్తి గ్రామంలో నివాసముంటు పత్తి తీసే పనులకు వెళ్తుండేవారు.
పత్తి పనులు ముగించుకొని తమ స్వగ్రామానికి వెళ్లేందుకు బైక్ పై చిట్యాల బస్ స్టేషన్కు వెళుతున్న క్రమంలో ఉరుమడ్ల గ్రామ శివారులో గల సబ్ స్టేషన్ ముందు మూలమలుపు వద్దకు రాగానే బైకు అదుపుతప్పి పక్కనే ఉన్న కాల్వలో పడిపోగా మృతుడి నుదుటిపై బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని వెంట ఉన్న అతని భార్యకు గాయాలయ్యాయి. మృతుని సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ మామిడి రవికుమార్ తెలిపారు.