calender_icon.png 8 November, 2025 | 6:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా కార్తీక మాస కళ్యాణం

08-11-2025 05:19:35 PM

జనగామ, పేపర్ (చిల్పూర్) (విజయక్రాంతి): జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వేంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాసము పురస్కరించుకొని శనివారం స్వామివారి కళ్యాణము వేదమంత్రోచరణలతో వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, ధర్మకర్త మండలి సభ్యులు ఆలయ ఈవో లక్ష్మీ ప్రసన్న, జూనియర్ అసిస్టెంట్ మోహన్ అర్చకులు బ్రాహ్మణపల్లి రవీందర్ శర్మ, సౌమిత్రి శ్రీరంగాచార్యులు, కృష్ణమాచార్యులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్ వాస్తవ్యులు వెంకట విశ్వమోహన మురళీకృష్ణ శర్మ, వెంకట సత్య సిద్ధార్థ సుబ్రహ్మణ్య శర్మ, వడ్లమాని అర్జున్ - సత్య, శ్రీనివాస్- భవ్యలు అన్నదాన వితరణ చేశారు.