08-11-2025 05:13:22 PM
నిర్మల్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్మల్ జిల్లా కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తూ.. ఆరు గ్యారంటీల అమలు కోసం సీఎం చేస్తున్న కృషి చేస్తున్నారని అన్నారు.