08-11-2025 05:11:17 PM
నిర్మల్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంఘం గుర్తిస్తుందని రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి పాపన్న అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోగా అధ్యక్షులుగా సత్తయ్య ప్రధాన కార్యదర్శిగా భూమన్న కోశాధికారిగా మచ్చేందర్ తో పాటు జిల్లా కమిటీని ప్రకటించారు. అనంతరం కొత్త కమిటీని సన్మానం చేశారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన జిల్లా కార్యవర్గానికి శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతూ నిర్మల్ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల, సంఘ ఉన్నతిని వారు కాంక్షించారు. ఈ కోరికకు అనుగుణంగా భవిష్యత్తులో సమస్య పరిష్కారం కొరకే నిరంతరము పనిచేస్తూ నిర్మల్ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల మన్ననలు పొందాలని వారు ఆకాంక్షించారు.