17-02-2026 08:04:11 PM
తలమడుగు,(విజయక్రాంతి): మండలంలోని కజ్జర్ల ప్రాథమిక పాఠశాలలో మంగళవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు పురస్కరించుకొని బీఆర్ఎస్ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముందుగా విద్యార్థిని విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి పండ్లను పంపిణీ చేశారు. అనంతరం సాయి లింగి వృద్ధాశ్రమంలో వృద్దులతో కలిసి కేక్ కట్ చేసి వృద్దులకు పండ్లు పంపిణి చేశారు.
ఈ సందర్భంగా బోథ్ నియోజకవర్గం బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కిరణ్ కుమార్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ స్థాపించి ఉద్యమం చేపట్టారని నాలుగు కోట్ల ప్రజలని ఏకతాటి పై తెచ్చి రాష్ట్రాన్ని సహకారం చేశారని అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఈ విషయం తెలుసని మళ్లీ కెసిఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ తోట వెంకటేష్, బిఆర్ఎస్ నాయకులు కేదారేశ్వర్ రెడ్డి, సర్పంచులు వెంకన్న, దేవరావు, చంటి, ఉప సర్పంచ్ రాగి దీపక్, ప్రధాన్ వామన్, తోట శ్రీనివాస్, రాంబాయి, వెంకట్ రెడ్డి, నవీన్, ప్రమోద్, జైపాల్,మల్లయ్య,ప్రశాంత్,తదితరులు పాల్గొన్నారు.