23-10-2025 01:09:34 AM
హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రచారం చేసేందుకు కేసీఆర్ కూడా హాజరవుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉప ఎన్నిక బీఆర్‌ఎస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో గులాబీ దళపతి పేరు కూడా ఉండ డం.. తాజా పరిణామాలపై అధినేతనే వరుసగా సమావేశాలు నిర్వహిస్తుండటం ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావులతో ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో కీలకంగా భేటీ అయ్యారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన రోడ్ షోలు, ప్రచార వ్యూహాలతోపాటు తాజా రాజకీయ పరిణామాలపైనా వారు చర్చించినట్టు తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల అంశంపైనా చర్చ జరిగినట్టు సమాచారం. జూబ్లీహిల్స్‌లోని వివిధ ప్రాంతాల ఇన్‌చార్జ్‌లతో గురు వారం కేసీఆర్ సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఉపఎన్నికకు సం బంధించిన ప్రచారవ్యూహాలపై వారికి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారని తెలిసింది.