02-10-2025 12:11:58 AM
ఆదిలాబాద్, అక్టోబర్ ౧ (విజయక్రాంతి): ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంలో మీడియా పాత్ర చాలా కీలక మని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మీడియా ప్రతినిధులు ఎన్నికల కమిషన్ నిబంధనలను తప్పకుండా పాటించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్ని కల సందర్భంగా ఆదిలాబాద్ కలెక్టరేట్ లోని డీపీఆర్‌ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను బుధవారం కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను మేరకే యాడ్స్ ప్రచురించాలని సూచించారు. పత్రికల్లో పెయిడ్ ఆర్టిక ల్స్ రాస్తే వాటిపై విచారణ చేపట్టి సదరు నాయకులకు నోటీసులు జారీ చేయడం జరుగుతుందన్నారు. మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ అనుమతి మేరకే పెయి డ్ ఆర్టికల్స్‌ను ప్రచూరించాలని సూచించారు.
ఇతర ఎన్నికల కంటే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా సెన్సిటివ్ ఎన్నికలు కాబట్టి మీడియా ప్రతినిధులందరూ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, శ్యామలాదేవి, డి.పి.ఆర్.ఓ తిరుమల, పలువురు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు