calender_icon.png 26 December, 2025 | 8:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల పక్షాన పోరాడేది కేసీఆరే

26-12-2025 01:24:50 AM

సూర్యాపేట, డిసెంబర్ 25 (విజయక్రాంతి) : ఎవరిని చెప్పిన నిరంతరం ప్రజల పక్షాన పోరాడేది కేసీఆర్ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి హోదాను మరింత దిగజార్చుతు రేవంత్ రెడ్డి గల్లీ నాయకుడిగా మారిపోయాడన్నారు. కెసిఆర్ అడిగినదానికి సమాధానం చెప్పలేకనే విషం కక్కుతున్నడన్నారు.

రేవంత్ రెడ్డి ఎంత దిగజారిన  ఆ స్థాయికి బి ఆర్ ఎస్ నాయకులు దిగజారరు అన్నారు. రెండేళ్లలో ఒక్కసారైనా కేసీఆర్ నీ పేరు ఎత్తలేదని, రేవంత్ మాత్రం ప్రతిరోజు కేసీఆర్ పై నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడన్నారు. పోలీసులు, అధికారులు, మీ గూండాలు,  మీ పార్టీ నాయకులు అందరూ కలిసి సర్పంచ్ ఎన్నికల్లో పనిచేసినా ప్రజలు బిఆర్‌ఎస్ పక్షాన నిలబడి అద్భుతమైన ఫలితాలు అందించారన్నారు. మంచి పనులు చేసి ప్రజా హృదయాలను గెలవాలన్నారు.  కృష్ణా, గోదారి జలాలు దోపిడీకి గురైతున్నాయని చెప్పునా పట్టించుకోకపోవడం చేతగానితనానికి నిదర్శనం అన్నారు.

ఒకవైపు చంద్రబాబు, మరోవైపు మోడీ ద్రోహం చేస్తున్నారన్నా చెవిన పెట్టకపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్నారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే మేము మౌనంగా కూర్చోలేమన్నారు. రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలతో నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ప్రజలు తీవ్ర నీటి సమస్యలు తలెత్తడం ఖాయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలన్నారు. ఈ సమావేశంలో పలువురు బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.