26-12-2025 01:23:37 AM
కుత్బుల్లాపూర్, డిసెంబర్ 25(విజయక్రాంతి): భారత రత్న మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి జయంతి దుండిగల్ మున్సిపల్ బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. దుండిగల్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షు లు పీసరి కృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, సిర్పూర్ శాసనసభ్యులు పాల్వా యి హరీష్ బాబు, జిల్లా ఇంచార్జి అధ్యక్షులు డా. ఎస్ మల్లారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొల్లి మాదవి, జిల్లా ప్రధాన కార్యదర్శి విగ్నేశ్వర్, జిల్లా ఉపాధ్యక్షురాలు, మాజీ సర్పంచ్ కొమ్ము మంగమ్మ, రాష్ట్ర ఎస్టీ మోర్చా శ్యామ్ రావ్, నల్ల రామచంద్రరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకు లు ఎమ్మెల్యే చేతుల మీదుగా బీజేపీ పార్టీ జెం డా ఆవిష్కరణ చేసి అనంతరం రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఎంపీ ఈటల రాజేందర్ చేతుల మీదు గా వాజ్‌పేయి చిత్రపటానికి నివాళులు అర్పించి పేదలకు దుప్ప ట్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాపట్లాడుతూ దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి వాజ్ పేయి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోనె మల్లారెడ్డి, ఎంబరి ఆంజనేయు లు, డి. సీతారాంరెడ్డి, తురాయి భానుగౌడ్,డి. ప్రభాకర్ రెడ్డి, ఆర్ నర్సింహా చారీ,ఏ. శ్రీనివాస్ యాద వ్, ఆకుల విజయ్ కుమార్,ఎన్. రోజా, ఎం. అతీష్ బాబు,అందె అశోక్, క్యాసారం రాజు, సారా నవీన్, చిన్నా ముదిరాజ్,చింతకాయల నవీన్, మురళి కృష్ణ,నల్ల రాజిరెడ్డి, పీ. ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.