calender_icon.png 2 May, 2025 | 9:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీని కనుమరుగుచేసిందే కేసీఆర్

29-04-2025 11:56:54 PM

రైతులను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు...

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి..

హైదరాబాద్ (విజయక్రాంతి): బస్సుల్లో మహిళలు కొట్లాడుకుంటున్నారని చెపుతున్న కేసీఆర్.. అసలు ఆర్టీసీని కనుమరుగు చేసిందే ఆయనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(TPCC Working President Jagga Reddy) అన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడారు. కేసీఆర్ విమర్శిస్తున్నారు అంటే ఉచిత బస్సు సక్సెస్ అయినట్టేనని, ఆయనకు నష్టం కలుగుతుంది కాబట్టి ఉచిత ప్రయాణ పథకాన్ని విమర్శస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ సభ జరగడానికి తాము ఇచ్చిన స్వేచ్ఛనే కారణమని చెప్పారు. రైతు రుణమాఫీపై ఏ ఊరు వెళ్దామో చెప్పాలని కేసీఆర్‌కు సవాల్ చేశారు. ఏడాదిలో తమ ప్రభుత్వం రూ.22 వేల కోట్లు రుణమాఫీ చేస్తే పదకొండేళ్లలో కేసీఆర్ చేసిన మాఫీ రూ.20 వేల కోట్లు మాత్రమే అన్నారు. రైతులను తప్పుదోవ పట్టించేలా కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.