calender_icon.png 23 July, 2025 | 7:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణం తీసిన ఫ్రిజ్‌లో పెట్టిన మటన్

23-07-2025 01:36:19 AM

  1. ఒకరి మృతి, 13 మందికి అస్వస్థత
  2. మృతుడు ఆర్టీసీ కండక్టర్ శ్రీనివాస్ 
  3. వనస్థలిపురంలోని ఆర్టీసీ కాలనీలో విషాదం 

ఎల్బీనగర్, జూలై 22: బోనాల పండుగనాడు తెచ్చుకున్న మటన్ వండి, ఫ్రిజ్‌లో పెట్టి మరుసటి రోజు తినడంతో ఆ కుటుంబంలో ఒకరు మృతిచెందగా.. 13 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన వనస్థలిపురంలోని ఆర్టీసీ కాలనీలో జరిగింది. వనస్థలిపురంలోని ఆర్టీసీ కాలనీకి చెందిన ఆర్టీసీ కండక్టర్ శ్రీనివాస్‌యాదవ్(49) బోనాల పండుగ సందర్భంగా తన ఇంటికి బావ, బంధువులను పిలిచి విందు ఏర్పాటు చేశాడు.

ఆదివారం రాత్రి అంద రూ భోజనాలు చేశారు. మిగిలిన మటన్ ఫ్రిజ్‌లో నిల్వ చేశా రు. సోమవారం ఉద యం మిగిలిన మాంసాహారాన్ని అం దరూ తిన్నారు. తరువాత కుటుంబ సభ్యులు 13 మంది వాంతులు, విరేచనాలతో అనారోగ్యానికి గురయ్యారు. మంగ ళవారం ఉదయం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శ్రీనివాస్‌యాదవ్ మృతి చెందాడు.

మిగిలిన 12 మంది చింతకుంటలోని హిమాలయ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరు ఐసీయూ లో చికిత్స పొందుతుండగా, మిగిలిన వారు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని డాక్టర్లు తెలిపారు. మృతుడు శ్రీనివాస్ ఫలక్‌నామా ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్నాడు.