calender_icon.png 23 July, 2025 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధన్‌ఖడ్ రాజీనామా ఆమోదం

23-07-2025 12:48:21 AM

  1. సంతకం చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
  2. కేంద్ర హోంశాఖకు రాష్ట్రపతి భవన్ సమాచారం
  3. త్వరలో ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ
  4. జగదీప్ ధన్‌ఖడ్ సేవలు మరువలేనివి: మోదీ

న్యూఢిల్లీ, జూలై 22: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. ఈ మేరకు మంగళవారం రాజీనామాకు సంబంధించిన ఫైల్‌పై సంతకం చేశారు. అనంతరం ఈ సమాచారాన్ని రాష్ట్రపతి కార్యాలయం హోం మంత్రిత్వ శాఖకు తెలియజేసింది. అలాగే దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 68 ప్రకారం.. ఉపరాష్ట్రపతి రాజీనామా చేస్తే లేదా మరణిస్తే త్వరగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. 

సమావేశాల్లో భాగం గా రాజ్యసభలో ముఖ్యమైన చట్టాలు పెం డింగ్‌లో ఉన్నందున కొత్త ఉపరాష్ట్రపతిని త్వరగా ఎన్నుకోవాల్సిన అవసరముంది. అ ప్పటివరకు సభను తాత్కాలికంగా డిప్యూటీ చైర్‌పర్సన్ హరివంశ్ సింగ్ నడిపించనున్నారు. ఇప్పటివరకు అధికార ఎన్డీయే (బీజే పీ కూటమి), ప్రతిపక్షాలు తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు.

దీంతో ఉపరాష్ట్రపతిగా ఎవరు రానున్నారనే దానిపై చర్చ లు ప్రారంభమయ్యాయి. అయితే ఉపరాష్ట్రపతి పదవికి జనతాదళ్ (యునైడెట్) ఎంపీ గా ఉన్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివం శ్ వైపే కేంద్రం మొగ్గు చూపే అవకాశముం ది. మరోవైపు బీహార్ సీఎం నితీశ్ కుమార్ పేరు కూడా ఉపరాష్ట్రపతి రేసులో ఉన్నట్టు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. 

ధన్‌ఖడ్‌కు ప్రధాని కృతజ్ఞతలు

ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ సందర్భంగా ధన్‌ఖడ్ చేసిన ప్రజాసేవకు, ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితానికి మోదీ ‘ఎక్స్’ వేదికగా ప్రశంసలు కురిపించారు. భారత ఉపరాష్ట్రపతి సమా అనేక పదవుల్లో జగదీప్ ధన్‌ఖడ్ దేశానికి సేవ చేశారని గుర్తుచేశారు. ఆయన ఎల్లప్పుడు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. 

ఆర్టికల్ 66 ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నిక

రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం ఉ పరాష్ట్రపతి ఎన్నికల విధానం జరుగుతుంది. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ‘ఎలక్టోరల్ కాలేజీలో పార్లమెంటు ఉభయ సభలు (లోక్ సభ, రాజ్యసభ) సభ్యులు మాత్రమే ఉంటా రు. రాష్ట్ర శాసనసభ సభ్యులకు ఈ ఎన్నికలో ఓటు హక్కు ఉండదు. ఇక ఎన్నిక ‘రహస్య బ్యాలెట్’ ద్వారా జరుగుతుంది. అనుపాత ప్రాతినిధ్య వ్యవస్థ ఆధారంగా ‘సింగిల్ ట్రా న్స్‌ఫరబుల్ ఓటు’ పద్ధతిని ఉపయోగించి ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం త్వరలో విడు దల చేయనుంది.

ఆ మూడున్నర గంటలు ఏం జరిగింది?: కాంగ్రెస్

జగదీప్ ధన్‌ఖడ్ .. కనీసం ఫేర్‌వెల్ స్పీచ్ లేకుండానే నిష్క్రమించడం పలు చర్చలకు దారి తీసింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికర పోస్టుచేశారు. ‘ధన్‌ఖడ్ నిబంధనలు, ప్రొటోకాల్ పక్కాగా పాటించే వ్యక్తి. సభ జరిగినంత సేపు హుషారుగా కనిపించిన ధన్‌ఖడ్‌ను సాయంత్రం పలువురు నేతలు కూడా కలుసుకున్నారు.

సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు బిజినెస్ అడ్వైజరీ కమిటీకి అధ్యక్షత వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు హాజరయ్యారు. చర్చ అనంతరం సాయంత్రం 4.30 గంటలకు మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. అయితే మరోసారి భేటీకి రిజిజు, నడ్డా రాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ధన్‌ఖడ్ సభను మంగళవారానికి వాయిదా వేశారు.

దీన్ని బట్టి నిన్న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4.30 మధ్య.. మూడున్నర గంటల పాటు ఏదో పెద్ద విషయమే జరిగింది. ఉద్దేశపూర్వకంగానే రిజిజు, నడ్డా గైర్హాజరయ్యారు. అయితే ధన్‌ఖడ్ నిర్ణయాన్ని మనం గౌరవించాల్సిందే. కానీ అందులో చాలా లోతైన కారణాలున్నాయి’ అని పేర్కొన్నారు.

అరుదుగా మధ్యంతర రాజీనామాలు

గతంలో మన దేశంలో ఉపరాష్ట్రపతి పదవికి మధ్యంతర రాజీనామాలు చాలా అరు దుగా జరిగాయి. వీవీ గిరి, ఆర్ వెంకట్రామన్, శంకర్ దయాళ్ శర్మ, కేఆర్ నారాయ ణన్‌లు ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. అయితే వీళ్లు రాష్ట్రపతి ఎన్నికల్లో పో టీ చేసి విజయం సాధించారు. కానీ బైరాన్ సింగ్ షెకావత్ (2007)లో రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిభా పాటిల్ చేతిలో ఓటమి పాల వ్వడంతో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో ఉపరాష్ట్రపతి పదవి 21 రోజుల పాటు ఖాళీగా ఉంది. కృష్ణకాంత్ (2002) పదవిలో ఉండగా మరణించిన ఏకైక రాష్ట్రపతి.

రాజీనామాకు కారణాలివేనా? 

ఉపరాష్ట్రపతి గా మరో రెండేళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ జగదీప్ ధ న్‌ఖడ్  ఉన్నపళం గా పదవికి రాజీనా మా చేయడం సంచలనం రేపింది. అనారోగ్య కారణాలతో రాజీనామా చేసినట్లు ఆయ న పేర్కొన్నప్పటికీ విపక్షాలు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యవహారం పై ఎన్డీయే కూటమి మౌనం వహించగా.. ప్రధాని మోదీ సహా కొందరు బీజేపీ నేతలు స్పం దించారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో తొలిరోజు జరిగిన పరిణామాలు కూడా ధన్‌ఖడ్ రాజీనామా వెనుక కారణాలనే వాదన వినిపిస్తోంది. జస్టిస్ యశ్వం త్ వర్మ అభిశంసన కోరుతూ 68 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేసిన నోటీసు తనకు అందిందని, దాన్ని అంగీకరిస్తున్నట్టు ఆయన వెల్లడించడం.. అధికార పార్టీకి మింగుడు పడని అంశంగా మారినట్టు సమాచారం.

ఈ అంశానికి సంబంధించి లోక్‌సభలో ప్రభుత్వం తీర్మానం ప్ర వేశపెడుతున్న సమయంలోనే రాజ్యసభ చైర్మన్ దీన్ని అంగీకరించడం తొందరపాటు చర్యగా అధికార పార్టీ భావించినట్టు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం నిర్వహించిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశానికి మంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజుజు హాజరుకాకపోవడం ధన్‌ఖడ్‌కు ఆగ్రహం తెప్పిం చిందని సమా చారం.

మరోవైపు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను తదుపరి రాష్ట్రపతిగా చేయా లన్న ఉద్దేశంతోనే ధన్‌ఖడ్ రాజీనామా చేశారనే చర్చ నడుస్తోంది. బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలు దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.ప్రస్తుతం అదే రాష్ట్రానికి చెం దిన జేడీయూ నేత హరివంశ్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్నారు.

కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు? 

ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ ఆకస్మిక రాజీనామా చేయడంతో ఆయన వారసుడెవరన్న చర్చ మొదలైంది. వర్షాకాల సమావేశాలు మొదలుకావడం.. తొలిరోజే ధన్‌ఖడ్ పదవికి రాజీనామా చేయడంతో ఈ సమావేశాల్లోనే ఉపరాష్ట్రపతి ఎన్నిక చేపడతారా అనేది ఆసక్తికరంగా మారింది.రాబోయే రోజుల్లో ఆయన వారసుడెవరనే అంశాన్ని పరిశీలించే అవకాశముంది.

ఈ మేరకు జగదీప్ ధన్‌ఖడ్ లాగే గతంలో గవర్నర్‌గా పని చేసిన వ్యక్తినే ఉపరాష్ట్రపతిగా.. లేదంటే కేంద్ర మంత్రుల్లో ఒకరిని.. లేదా అందరికి ఆమోదయోగ్యమైన ఆర్గనైజేషన్ నేతను బీజేపీ ఎంపిక చేసే అవకాశాలున్నాయి.ఇప్పటికే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్‌ను ఉపరాష్ట్రపతి పదవి వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.