10-05-2025 11:51:24 PM
టీపీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్
మునుగోడు,(విజయక్రాంతి): కేదారేశ్వర స్వామి అనుగ్రహం రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని స్వామి దీవెనలతో పాడిపంటలు పశుసంపద అష్టైశ్వర్యాలతో రాష్ట్రం వర్ధిల్లాలని టిపిసిసి ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం మండలంలోని కోతులారం గ్రామంలో కేదారేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆయన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం,ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ,బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఆలయ కమిటీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, టిపిసిసి అధికార ప్రతినిధి ఉన్న కైలాస్ నేత తో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి పలహారాలను సేవించారు.
పెహల్గాంలో భారతీయులపై జరిగిన ఉగ్రదాడి దురదృష్టకరమని పాకిస్తాన్ పై విరోచితంగా పోరాడుతున్న సైనికులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నరహంతకు రాక్షసుల ఉగ్రవాదులను హతం చేసి దేశ సేవ కోసం పోరాడుతున్న వీరులకు వందనాలని అన్నారు. అంతకుముందు నూతనంగా ఆధునికరించిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి తొలిసారిగా వచ్చిన టిపిసిసి అధ్యక్షునికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పూల ఓకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బీమనపల్లి సైదులు, మాజీ సర్పంచ్ జాజుల పారిజాత సత్యనారాయణ, జాల వెంకటేశ్వర్లు,తాటికొండ సైదులు, వట్టి కోటి శేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.